రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విద్యుత్ కేంద్రాల ప్రైవేటీకరణ, జనరేషన్ ప్లాంట్ల అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు.
నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో..
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయంపై.. కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆందోళన చేపట్టింది. ప్రకాశం జిల్లా చీరాలలోనూ విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ.. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.
తూర్పుగోదావరిలో..
తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రామచంద్రాపురం సబ్-డివిజన్ పరిధిలోని విద్యుత్ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ జనరేటరీలను ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.