ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

BJP Fund collection : వరద బాధితుల కోసం.. భాజపా విరాళాల సేకరణ - వరద బాధితులకు నిధుల సేకరణపై భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలం అయ్యింది. వరద బాధితుల సహాయార్థం భాజపా రాష్ట్రవ్యాప్తంగా నిధి, వస్తుసేకరణ కార్యక్రమాన్ని(BJP Fund collection for flood affected people in state) చేపట్టింది.

BJP Fund collection
వరద బాధితుల కోసం భాజపా నిధి, వస్తు సేకరణ

By

Published : Nov 25, 2021, 6:42 PM IST

వరద బాధితుల సహాయార్ధం భారతీయ జనతా పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిధి, వస్తుసేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. విజయవాడ ప్రారంభించిన(BJP Fund collection program started from Vijayawada) ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు.

వరద బాధితుల కోసం తక్షణ సహాయంగా వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందన్న సోమూ.. తమ వద్ద డబ్బు లేదని చెప్పి సహాయ పునరావాస కార్యక్రమాల(Maintenance of Rehabilitation Centers) నిర్వహణను పక్కన పెట్టిందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం పనితీరు సక్రమంగా లేదని ఆరోపించారు.

వరదలు తగ్గి ఆరు రోజులు అవుతున్నా.. గ్రామాల్లో ఇంకా పారిశుధ్యం చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ఇళ్లలో ఇసుక మేటలు తొలగించేందుకు ప్రభుత్వం నుంచి తగిన సహకారం కొరవడుతోందన్నారు. బాధితులను ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపాదికన రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలన్న వీర్రాజు.. కేంద్రం నుంచి ప్రత్యేక బృందాలు త్వరలోనే రాష్ట్రానికి రానున్నాయని వెల్లడించారు.

ఇదీ చదవండి : Toilet Problems: మంటగలుస్తున్న మహిళల ఆత్మగౌరవం... శౌచాలయాల్లేక ఇబ్బందులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details