వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగింపును ఉపసంహరించుకోవాలంటూ రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 22 రద్దు చేయాలని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని రైతులు డిమాండ్ చేశారు. అఖిలపక్ష రైతు సంఘాల రాష్ట్ర సమన్వయ కమిటీ పిలుపుతో ఏలూరులోని విద్యుత్ భవనం వద్ద రైతు సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించవద్దంటూ నినాదాలు చేశారు.
పంపుసెట్లకు మీటర్లు బిగింపు నిర్ణయంపై రాష్ట్రవ్యాప్త ఆందోళనలు - పంపుసెట్లకు మీటర్లు బిగింపు నిర్ణయంపై రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగింపు నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన జీవో 22 రద్దు చేయాలని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని రైతులు డిమాండ్ చేశారు.
వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లను బిగిస్తే రైతుల మెడలకు ఉరితాడు బిగించినట్లేనని గుంటూరు జిల్లా తెనాలిలో రైతు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి నినదించారు. అనంతరం విద్యుత్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి మీటర్లు బిగించటం ఆపాలని.. లేనిపక్షంలో పార్టీలకు అతీతంగా నిరసనలు ఉద్రిక్తతం చేస్తామని రైతు సంఘం నాయకులు తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరులో ఆందోళన చేసి అధికారులకు వినతిపత్రాన్ని అందిచారు.
ఇవీ చూడండి