రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని కలెక్టర్లను రాష్ట్రస్థాయి కొవిడ్ కంట్రోల్ సెంటర్ ఛైర్మన్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. ఆర్టీపీసీఆర్‌తోపాటు ట్రునాట్ టెస్టులు కూడా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైరస్ చాలా వేగంగా విస్తరిస్తోందన్న జవహర్‌రెడ్డి ప్రాథమిక కాంటాక్టు పరీక్షలు వెంటనే పూర్తి చేయాలన్నారు. కలెక్టర్లు తనిఖీలు చేపడితే తప్ప పరిస్థితి అదుపులోకి రాదని, ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగాలని నిర్దేశించారు. కొవిడ్ కేర్ సెంటర్లను తక్షణం అందుబాటులోకి తేవాలని సూచించారు. ప్రస్తుతం 19 వేల బెడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, మరో 19 వేల పడకలు అందుబాటులోకి తేవాలన్నారు. జవహర్‌రెడ్డి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో చర్యలు మొదలయ్యాయి.
ఆంక్షల విధింపు...
చిన్నారులకూ కొవిడ్ వైరస్ సోకుతున్న తరుణంలో గుంటూరు శివారులోని అడవితక్కెళ్లపాడులో పిడియాట్రిక్ కొవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 5 నుంచి 15ఏళ్ల మధ్య పిల్లలకు అక్కడ చికిత్స చేస్తారు. ప్రకాశం జిల్లాలోని 19 మండలాల్లో త్వరలోనే ఆంక్షలు విధిస్తామన్నారు కలెక్టర్ పోలా భాస్కర్. నిత్యవసరాల కొనుగోళ్లకూ సమయం నిర్దేశించి సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ విధించనున్నట్లు తెలిపారు. పశ్చిమగోదావరిజిల్లాలో కొవిడ్ పరీక్షలను రెట్టింపు చేసి ఆస్పత్రుల్లో పడకలు పెంచుతామని కలెక్టర్ వివరించారు.
స్వచ్చందంగా మూసివేత...