విశాఖ జిల్లాలో..
ఆటోలో తరలిస్తున్న 60 కిలోల గంజాయిని విశాఖ జిల్లా రోలుగుంట పోలీసుసు పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రెండు రూ.2లక్షల వరకు ఉంటుందని చెప్పారు. ఆటో సీజ్ చేసి.. నిందితుడి నుంచి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ ఉమామహేశ్వరరావు తెలిపారు.
ప్రకాశం జిల్లాలో..
ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలోని అటవీప్రాంతంలోని నాటుసారా స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు చేశారు. సుద్దకురావ తాండ సమీపంలోని అటవీ ప్రాంతంలో నాటుసారా తయారు చేయడానికి ఉంచిన 2000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 5 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో..
ఆంధ్ర సరిహద్దుల్లోని ఒడిశా గ్రామాల్లో సారా తయారీ స్థావరాలపై అడిషనల్ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ కే.శ్రీనివాస రావు, అసిస్టెంట్ కమిషనర్ ఎస్. సుఖేష్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. భారీగా బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఇచ్చాపురం పరిసర ప్రాంతం ఒడిశాలోని జరోధ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గంగాపూర్ రామచంద్రాపూర్ గ్రామాల్లో గల స్థావరాలపై రాష్ట్ర అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో గంగాపూర్ లో 20 వేల 600 లీటర్లు.. రామచంద్రపురంలో 6వేల లీటర్లు.. కొండజాపూర్ లో 4.800 లీటర్లు బెల్లం ఊట, 290 నాటుసారాను ధ్వంసం చేశారు.