Anganwadi's Protest: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు.. చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు.
ప్రకాశంలో..
ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టిన కార్మికులు.. రూ.26వేలు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. అంగన్వాడీలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
గుంటూరులో..
గుంటూరులో కలెక్టరేట్ ముందు అంగన్వాడీ కార్యకర్తలు బైఠాయించి పెద్దఎత్తున నినాదాలు చేశారు. రిటైర్‌మెంట్ బెనిఫిట్ రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అనంతపురంలో..
అనంతపురంలో అంగన్వాడీ కార్మికులు.. నిపసన చేపట్టారు. రేషన్ కార్డు తొలగించకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు.
శ్రీకాకుళంలో..
శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద.. అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా జగన్ ప్రభుత్వం అంగన్వాడీలను రోడ్డెక్కేలా చేసిందని మండిపడ్డారు.
కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో..
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో అంగన్వాడీ నిరసనకారులు మండిపడ్డారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో చలో కలెక్టరేట్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. శాంతియుతంగా ధర్నాలు చేపట్టాలని చూసిన అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే.. పెద్దఎత్తున ఆందోళన చేపడతామని అంగన్వాడీలు హెచ్చరించారు.
ఇదీ చదవండి:
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తల చలో కలెక్టరేట్ కార్యక్రమం అసంపూర్తిగా కొత్తపట్నం- ఒంగోలు రహదారిలో వంతెన పనులు.. ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు