తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి - కోస్తాంధ్రలో చిరుజల్లులు - రాష్ట్ర ఉష్ణోగ్రత వివరాలు
రాష్ట్రంలో కురిసిన వర్షాలకు అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. హమ్మయ్యా అని రైతులు ఊపిరి పీల్చుకొనే లోపే మరో అల్పపీడనం వచ్చిపడింది. తెలంగాణ, మహారాష్ట్రల మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దాని ప్రభావంతో ఏపీలోని పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
వాతావరణ నివేదిక
By
Published : Oct 16, 2020, 8:47 PM IST
బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం వరకు తెలంగాణ, మహారాష్ట్రల మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించింది. దాని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసినట్లు వాతావరణశాఖ తెలియచేసింది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరుల్లో ఆకాశం మేఘావృతమై కొద్దిపాటి వర్షం కురిసింది.
రాష్ట్రంలో ఈరోజు నమోదైన వర్షపాతం, ఉష్ణోగ్రత వివరాలు ఈ విధంగా ఉన్నాయి.