ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్ర పోలీసు ఫిర్యాదు అథారిటీపై హైకోర్టులో విచారణ - highcourt latest news

రాష్ట్ర పోలీసు ఫిర్యాదు అథారిటీ, పోలీసు ఎస్టాబ్లిష్​మెంట్ బోర్డు ఏర్పాటు చేయకపోవటంపై స్టేట్ సెక్యూరిటీ కమిషన్​లో ప్రతిపక్ష నేతకు స్థానం కల్పించకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్​పై హైకోర్టులో విచారణ జరిపింది.

రాష్ట్ర పోలీసు ఫిర్యాదు అథార్టీపై హైకోర్టులో విచారణ
రాష్ట్ర పోలీసు ఫిర్యాదు అథార్టీపై హైకోర్టులో విచారణ

By

Published : Feb 15, 2020, 6:34 AM IST

Updated : Feb 15, 2020, 7:24 AM IST

రాష్ట్ర పోలీసు ఫిర్యాదు అథారిటీ, పోలీసు ఎస్టాబ్లిష్​మెంట్ బోర్డు ఏర్పాటు చేయకపోవటంపై దాఖలైన పిల్​పై హైకోర్టులో విచారణ జరిపింది. పూర్తి వివరాలతో ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి,హోంశాఖ ముఖ్య కార్యదర్శికి, డీజీపీలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్ జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. స్టేట్ సెక్యూరిటీ కమిషన్​లో ప్రతిపక్ష నేతను మినహాయిస్తూ గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన జీవో 42 సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని పేర్కొంటూ న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

Last Updated : Feb 15, 2020, 7:24 AM IST

ABOUT THE AUTHOR

...view details