ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జాషువా సాహిత్యం మరింత వ్యాపించాలి: యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ - యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్

విజయవాడలో ఒక హోటల్లో ప్రముఖ రచయిత డాక్టర్ గుమ్మా సాంబశివరావు రచించిన 'గుర్రం జాషువా పద్య చంద్రిక' పుస్తక ఆవిష్కరణ సభలో రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ పాల్గొన్నారు. జాషువా హృదయ వేదనను పుస్తకరూపంలో గొప్పగా ఆవిష్కరించిన సాంబశివరావును అభినందించారు.

రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్
రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్

By

Published : Oct 10, 2021, 10:46 PM IST

గుర్రం జాషువా హృదయ వేదనను 'గుర్రం జాషువా పద్య చంద్రిక' పుస్తకం ద్వారా రచయిత డాక్టర్ గుమ్మా సాంబశివరావు అందించటంపై రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. విజయవాడలోని ఓ హోటల్​లో జరిగిన పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొన్న ఆయన.. జాషువా సాహిత్యం మొత్తాన్ని పద్య చంద్రిక పుస్తకం ద్వారా డాక్టర్ సాంబశివరావు అందించారని ప్రశంసించారు.

కవికోకిల జాషువా సాహిత్యం సమాజంలోకి మరింతగా వ్యాపించాలని ఆకాంక్షించారు. అందుకు అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వ తరపున అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. 'గుర్రం జాషువా పద్య చంద్రిక' తరహా పుస్తకాలు సమాజంలోకి వస్తున్నంత కాలం తెలుగు భాష మనుగడకు ఢోకా ఉండదని యార్లగడ్డ అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:CM Jagan Tweet: 'అణగారిన ప్రజల ఆత్మగౌరవం కోసం పాటుబడిన న‌వ‌యుగ క‌వి చ‌క్ర‌వ‌ర్తి జాషువా'

ABOUT THE AUTHOR

...view details