రాష్ట్రంలో సీఎం జగన్ అమలు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక జనసేన, భాజపా, తెదేపా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ ఆరోపించారు.
రాష్ట్రంలోని క్రైస్తవులపై జరుగుతున్న దాడులు ఆయా పార్టీల నేతలకు కనిపించడం లేదా.. అని ప్రశ్నించారు. మత విద్వేషాలను రేచ్చగొట్టేందుకే ఆ 3 పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.