ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కరోనా సోకడం నేరం.. పాపం కాదు.. జాగ్రత్తలు పాటించాలి'

వ్యక్తిగత పరిశుభ్రత పాటించి.. తగు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయకుమార్ రెడ్డి అన్నారు. ఎలాంటి చికిత్స లేకుండానే 85 శాతం మంది వ్యాధి నుంచి కోలుకున్నారని తెలిపారు. తగు చికిత్స కోసం 14410 టెలీ మెడిసిన్​ను సంప్రదించాలని కోరారు.

'కరోనా సోకడం నేరం.. పాపం కాదు.. జాగ్రత్తలు పాటించాలి'
'కరోనా సోకడం నేరం.. పాపం కాదు.. జాగ్రత్తలు పాటించాలి'

By

Published : Jul 24, 2020, 8:37 PM IST

కరోనా సోకడం నేరం.. పాపం కాదని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయకుమార్ రెడ్డి అన్నారు. విజయవాడలో మీడియా ప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన కరోనా పరీక్ష కేంద్రాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షించారు. తగు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని సూచించారు. ఎలాంటి చికిత్స లేకుండానే 85 శాతం మంది వ్యాధి నుంచి కోలుకుంటున్నారని చెప్పారు.

కేవలం 5 శాతం మందికి మాత్రమే ఆస్పత్రిలో చికిత్స అవసరం అవుతుందని కమిషనర్​ పేర్కొన్నారు. తగిన చికిత్స కోసం 14410 టెలీ మెడిసిన్​ను సంప్రదించాలని సూచించారు. మాస్కులు ధరించడం, పరిశుభ్రత, శానిటైజేషన్ తప్పనిసరిగా పాటించి తమను తాము రక్షించుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details