Justice Battu Devanand : 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతావనిలో రాష్ట్ర రాజధాని ఇదీ అని చెప్పుకొనే పరిస్థితి తెలుగువారికి ఉందా అని... హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ప్రశ్నించారు. దానికి కారణం కొందరికి ముందుచూపు తక్కువ కావడం అయ్యుండవచ్చని అన్నారు. దిల్లీలో చదువుతున్న తన చిన్న కుమార్తెను... మీ రాజధాని ఏది అంటూ తోటి విద్యార్థులు ఆట పట్టిస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. 'అమృత భారతి' పేరిట ప్రపంచ రచయితల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన పుస్తకాన్ని... విజయవాడలో జస్టిస్ దేవానంద్ ఆవిష్కరించారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో తెలుగువారి ప్రగతి వ్యాసాల సంకలనంతో పుస్తకాన్ని ముద్రించారు.
Justice Battu Devanand: రాష్ట్ర రాజధాని ఇదీ... అని చెప్పుకొనే పరిస్థితి ఉందా? - జస్టిస్ బట్టు దేవానంద్ కీలక వ్యాఖ్యలు
Justice Battu Devanand : రాష్ట్రంలోని తాజా పరిణామాలపై రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. 75 స్వాతంత్య్ర భారతావనిలో తెలుగు వారికి ఇదీ రాష్ట్ర రాజధాని అని చెప్పుకొనే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. బయట వారి వద్ద అవమానాలు ఎదుర్కొనే పరిస్థితికి తెలుగు జాతి చేరిందని ఆవేదన చెందారు.

న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్
న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్
"గొప్పగా చెప్పుకోవచ్చుగానీ.. ఏం సాధించాం? రాష్ట్ర రాజధాని ఇదీ అని చెప్పుకొనే పరిస్థితి ఉందా? దిల్లీలో చదువుతున్న మా అమ్మాయిని ‘మీ రాజధాని ఏది?’ అని ఆటపట్టిస్తున్నారు. మన పిల్లలు కూడా తలవంచుకునే స్థితిలో ప్రస్తుతం తెలుగుజాతి ఉంది. ప్రతి దానికీ కులం, రాజకీయం, స్వార్థం.. ఇలాంటి అవలక్షణాలను మార్చాల్సిన బాధ్యత రచయితలదే"-జస్టిస్ దేవానంద్
ఇవీ చదవండి: