ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

రాష్ట్రంలో ఇప్పటివరకూ మూడు కరోనా కేసులు మాత్రమే నమోదైనా... వైరస్‌ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతోంది. కొవిడ్ లక్షణాలతో 24 గంటల్లో 11 మంది ఆసుపత్రుల్లో చేరారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ముందు జాగ్రత్తగా ఐసోలేషన్‌ వార్డులకు తరలిస్తున్నారు. వ్యాధి తీవ్రత దృష్ట్యా ఇంటర్‌ మూల్యాంకనం, పాలిటెక్నిక్‌ పరీక్షలు వాయిదా వేశారు. సందర్శనీయ ప్రాంతాలు మూసేశారు.

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు
కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

By

Published : Mar 21, 2020, 7:44 AM IST

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

రాష్ట్రంలో కరోనా లక్షణాలతో శుక్రవారం 11 మంది ఆసుపత్రుల్లో చేరారు. మొత్తంగా ఈ లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్య 39కి చేరింది. వందల మంది ఐసోలేషన్‌ వార్డుల్లో ఉన్నారు. ఇప్పటిదాకా ముగ్గురికి పాజిటివ్ నిర్ధరణ అయింది. విశాఖలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుడు... ఆసుపత్రిలో చేరడానికి ముందు జనం మధ్య ఎక్కువగా సంచరించినట్లు తేలింది. ఈ పరిస్థితుల్లో అప్రమత్తమైన అధికారులు... ఆయనతో కలిసి ప్రయాణించిన వారిని గుర్తించి పరీక్షలు చేస్తున్నారు. శుక్రవారం ఏపీ సంపర్క్ క్రాంతి రైలులో కరోనా బాధితుడు ఉన్నట్లు సమాచారం రావటంతో... కర్నూలు అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. హుటాహుటిన రైల్వేస్టేషన్‌ చేరుకున్న వైద్యబృందం... బాధితుడిని పరీక్షించింది.

విదేశాల నుంచి ఇప్పటివరకూ 12 వేల 540 మంది రాష్ట్రానికి వచ్చారు. వీరిలో 93 శాతం మందిని గుర్తించారు. మిగిలిన వారి కోసం వేట సాగుతోంది. విదేశాల నుంచి వచ్చినవారు స్వీయ గృహ నిర్బంధం పాటించాలని, అతిక్రమిస్తే చర్యలు తప్పవని... వైద్య, ఆరోగ్యశాఖ హెచ్చరించింది. యూరప్‌ నుంచి విజయవాడకు వచ్చిన యువతిలో కరోనా అనుమానిత లక్షణాలు ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. అబుదబి నుంచి నెల్లూరుకు వచ్చిన ఆరుగురుని నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. కరోనా అనుమానంతో కడప రిమ్స్ ఐసోలేషన్ వార్డులో చేరిన నలుగురికి నెగిటివ్ రాగా... మరో ముగ్గురి నివేదికలు అందాల్సి ఉంది. ఇప్పటికే సౌదీ, కువైట్ నుంచి వచ్చిన దాదాపు 2 వేల మందిని గుర్తించి... వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. కరోనా దృష్ట్యా కడప రిమ్స్‌లో నేటి నుంచి కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందించాలని నిర్ణయించారు. ఓపీ సేవలు నెలాఖరు వరకు ఆపేయాలని తీర్మానించారు.

ఇంటర్​ మూల్యాంకనం నిలిపివేత

కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా అధ్యాపకుల రక్షణ కోసం ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యాంకనాన్ని బోర్డు నిలిపివేసింది. పాలిటెక్నిక్​తో పాటు 6 నుంచి 9 తరగతి వరకు పరీక్షలు వాయిదా వేశారు. ఆసుపత్రులో ఆపరేషన్లు ఈ నెలాఖరు వరకూ నిలిపేశారు. పర్యటక ప్రదేశాలను మూసివేశారు. బోట్లు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ పరీక్షలు బంద్‌ చేశారు.

కరోనా కట్టడికి గుంటూరు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. గుంటూరు సర్వజన ఆసుపత్రిలో 30 పడకలతో ప్రత్యేక వార్డుని సిద్ధం చేశారు.వంద పడకలతో ప్రత్యేక విభాగాన్ని సిద్ధం చేయాలని నిర్ణయించారు. 4 ప్రైవేటు ఆసుపత్రులతోనూ చికిత్స అందించేలా ఒప్పందం చేసుకున్నారు. కరోనా అనుమానిత లక్షణాలతో ఐదుగురి నమూనాలు సేకరించి తిరుపతి ప్రయోగశాలకు పంపగా... వాటిలో 4 నెగిటివ్​గా వచ్చాయి.

ఇదీ చదవండి:

దేశంలో ఒక్కసారిగా పెరిగిన కేసులు- 236 మందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details