ఉన్నత విద్యలో కొత్త కోర్సుల రూపకల్పన, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్ సంస్థలకు ఉపకరించే కోర్సులపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకోసం ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ నేతృత్వంలో ఎనిమిది మంది నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ.. ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ కమిటీ ఆధునిక సమాజం, వివిధ పరిశ్రమలకు అవసరమయ్యే కొత్త కోర్సుల ఏర్పాటుపై కసరత్తు చేయాల్సి ఉంది. ప్రణాళిక బోర్డు నిర్వహణకు అవసరమయ్యే నిధులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలియజేసింది.