ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'శుభవార్త...అటవీశాఖలోని ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్' - ap job notifications

నిరోద్యుగులకు మరో తీపి వార్తను ప్రభుత్వం త్వరలో వినిపించనుంది. అటవీ శాఖలో 2వేల 552 క్షేత్ర స్థాయి పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు రాష్ట్ర అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి ఎన్‌.ప్రతీప్‌కుమార్‌ తెలిపారు.

'శుభవార్త...అటవీ శాఖలోని ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్'

By

Published : Oct 1, 2019, 11:52 PM IST

'శుభవార్త...అటవీ శాఖలోని ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్'
అటవీశాఖలోని 2వేల 552 క్షేత్ర స్థాయి ఖాళీ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి జగన్‌ మోహనరెడ్డి సుముఖత వ్యక్తం చేశారని రాష్ట్ర అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి ఎన్‌.ప్రతీప్‌కుమార్‌ తెలిపారు. జనవరిలో నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ కానుందని పేర్కొన్నారు. శాఖలో కీలకమైన విధుల నిర్వహణకు సంబంధించిన వాటిలో 56 శాతం పోస్టులు ఖాళీగా ఉన్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అటవీశాఖలో ప్రతి ఒక్కరికీ ఉద్యోగ విరమణ రోజునే ‘పింఛను చెల్లింపు ఆర్డరు’ (పీపీవో) చేతికందించేలా చూడాలనేది తమ ప్రధాన లక్ష్యమని విజయవాడలో స్పష్టం చేశారు.

కేరళ తరహాలో...
కేరళ తరహాలో రాష్ట్రంలోనూ అటవీ స్టేషన్లు ఏర్పాటు చేసే అంశాన్ని అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. నాలుగైదు బీట్లు, రెండు మూడు సెక్షన్లను కలిపి ఒక అటవీ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని- ఇవి అడవుల పరిరక్షణలో కీలకంగా ఉంటాయని ప్రతీప్ కుమార్ చెప్పారు.

కేంద్రానికి లేఖ...
తమ వద్దనిల్వ ఉన్న 5 వేల మెట్రిక్‌ టన్నుల ఎర్రచందనం అమ్మకానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని చెప్పారు. ఈ నెల నాలుగో తేదీన తిరుపతిలో ఎర్రచందనం నిల్వలు, ఇతర అంశాలపై తిరుపతిలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వన్యప్రాణులను కాపాడటం, అభయారణ్యాల పరిరక్షణ, సామాజిక అడవుల పెంపకంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములు చేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి వెల్లడించారు.

ఇవీ చూడండి-ఇక ప్రతి జనవరిలో ఉద్యోగాల జాతర: సీఎం

ABOUT THE AUTHOR

...view details