రాష్ట్రంలో వివిధ రంగాలకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల ద్వారా 2 లక్షల 31వేల 238 కోట్ల రూపాయల రుణం వచ్చే అవకాశం ఉందని మంత్రి కన్నబాబు తెలిపారు. నాబార్డు ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర క్రెడిట్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. వ్యవసాయ రంగానికి లక్షా 57వేల 642 కోట్లు, ఎంఎస్ఎంఈ రంగానికి 47వేల 402 కోట్లు, విద్యా రంగంలో 15వందల 84 కోట్లు, గృహ నిర్మాణానికి 14వేల 335 కోట్ల రూపాయలు రుణం పొందే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. ఆ మేరకు రాష్ట్రం వార్షిక ఋణ ప్రణాళిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కన్నబాబుతోపాటు సీఎస్ ఆదిత్యానాథ్ దాస్, నాబార్డు సీజీఎంలు, తదితరులు పాల్గొన్నారు.
'2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.31లక్షల కోట్ల ఋణ సహాయం' - nabard financial year 2021-22
నాబార్డు ఆధ్వర్యంలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర క్రెడిట్ సమావేశాన్ని విజయవాడంలో నిర్వహించారు. వివిధ రంగాలకు వచ్చే ఆర్థిక సంవత్సరానికిగానూ బ్యాంకుల ద్వారా రూ. 2.31 లక్షల కోట్ల ఋణం సహాయం అందే అవకాశం ఉందని మంత్రి కన్నబాబు అన్నారు.
2021-22 వార్షిక ఋణ ప్రణాళిక