నది జలాల విషయంలో ముఖ్యమంత్రి జగన్ చేసిన అసమర్థత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ అన్నారు. నది జలలపై తెలంగాణ మంత్రులు అడ్డగోలు ప్రకటనలు చేస్తుంటే.. ముఖ్యమంత్రి జగన్ నోరు మెదపకపోవడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణలోని ఏపీ ప్రజల దృష్ట్యా మాట్లాడట్లేదనడం, తెలంగాణ వాటాలో చుక్క నీటిని వదిలిపెట్టమన్న షర్మిల వ్యాఖ్యల పట్ల తీవ్రంగా మండిపడ్డారు.
'రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణ సీఎం ముందు తాకట్టు పెట్టారు'
తెలంగాణలో ఉన్నఆస్తులను కాపాడుకోవడానికే ముఖ్యమంత్రి జగన్.. జల వివాదంపై నోరు మెదపట్లేదని రాష్ట్ర కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణ సీఎం కేసీఆర్ ముందు తాకట్టు పెట్టారని విమర్శించారు.
జగన్ అసమర్థవ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
తెలంగాణలో ఉన్న ఆస్తులను కాపాడుకోవడానికి జగన్ మాట్లాడటం లేదని ఆరోపించారు. ఏపీ ప్రయోజనాలను తెలంగాణ సీఎం కేసీఆర్ ముందు తాకట్టు పెట్టారని విమర్శించారు. రాష్ట్ర రైతాంగ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని.. లేదంటే మహిళలుగా మేము ముందుకొచ్చి పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి..
cabinet decisions: కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..