ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెదేపా నేతలపై రాళ్లు, కర్రలతో దాడి దారుణం: రాష్ట్ర పౌరహక్కుల సంఘం - తెదేపా నేతలపై రాళ్లు, కర్రలతో దాడి దారుణం తాజా వార్తలు

తెదేపా నేతలపై రాళ్లు, కర్రలతో దాడి దారుణం
తెదేపా నేతలపై రాళ్లు, కర్రలతో దాడి దారుణం

By

Published : Sep 17, 2021, 3:07 PM IST

Updated : Sep 17, 2021, 4:05 PM IST

15:03 September 17

తెదేపా నేతలపై దాడి దారుణం

తెదేపా నేతలపై రాళ్లు, కర్రలతో దాడి చేయటంపై దారుణమని రాష్ట్ర పౌరహక్కుల సంఘం వ్యాఖ్యానించింది. దౌర్జన్యకారులకు పోలీసులే మద్దతివ్వడం దురదృష్టకరమని.. వైకాపా శ్రేణులు మీడియాపై చేసిన దాడిని ఖండిస్తున్నామని తెలిపింది.

చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత  

వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్..కార్యకర్తలతో కలిసి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం ముట్టడికి యత్నించారు. జగన్ సహా మంత్రులపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జోగి రమేశ్ నిరసనకు యత్నించడం, వారిని బుద్దా వెంకన్న సహా ఇతర తెదేపా నాయకులు ప్రతిఘటించే ప్రయత్నం చేయడం..యుద్ధ వాతావారణాన్ని సృష్టించింది. ఇరు పార్టీల నాయకులు పరస్పర నినాదాలు, దూషణలతో సంఘటనా స్థలం రణరంగాన్ని తలపించింది.  

ఈ సమయంలో కొందరు వైకాపా కార్యకర్తలు తమ వెంట తెచ్చుకున్న జెండా కర్రలతో దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇరువర్గాల మోహరింపుతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు బారికేడ్లు పెట్టి ఇద్దరినీ నిలువరించే ప్రయత్నం చేశారు. ఇరువర్గాలూ ఏ మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు.   

ఇదీ చదవండి

CBN HOME: అయ్యన్న వ్యాఖ్యలపై వైకాపా ఆందోళన..చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత

Last Updated : Sep 17, 2021, 4:05 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details