ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

BJP DELHI TOUR: దిల్లీ పర్యటనలో సోము వీర్రాజు నేతృత్వంలోని భాజపా బృందం.. - దిల్లీలో పర్యటించనున్న సోము వీర్రాజు

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలోని బృందం.. మూడు రోజులు దిల్లీలో పర్యటించనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, పోలవరం సహా పెండింగ్‌ సమస్యలపై కేంద్ర మంత్రులతో రాష్ట్ర నేతలు చర్చించనున్నారు.

state bjp delhi tour
దిల్లీలో పర్యటించనున్న సోము వీర్రాజు బృందం

By

Published : Aug 3, 2021, 1:46 AM IST

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, పోలవరం సహా పెండింగ్‌ సమస్యలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు..కేంద్ర మంత్రులతో చర్చించేందుకు 3 రోజులు దిల్లీలో పర్యటించనున్నారు. సోము వీర్రాజు నేతృత్వంలోని బృందం.. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షేకావత్‌ను కలిసి పోలవరం ప్రాజెక్టు, ఆర్​& ఆరా ప్యాకేజీ, ప్రాజెక్ట్‌కు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదు చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను కలవనున్న సోము వీర్రాజు బృందం... రాష్ట్రంలో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకురానున్నారు.

రైల్వేశాఖ మంత్రిని కలసి.. రాష్ట్రంలోని రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు, విశాఖ రైల్వే జోన్ అంశంపై చర్చించనున్నారు. కొత్త రైల్వే లైను కొవ్వూరు - భద్రాచలం అంశంపై మాట్లాడుతారని పార్టీ నేతలు తెలిపారు. కేంద్ర మంత్రులతో సమావేశం తర్వాత భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాను కలిసి రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలు, విస్తరణ, బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను వివరించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details