ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్ర బంద్​కు వైకాపా సంఘీభావం ..:  మంత్రి పేర్నినాని - శుక్రవారం రాష్ట్రబంద్

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు చేపట్టనున్న రాష్ట్ర బంద్​కు సంఘీభావం తెలుపుతున్నట్లు మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పునరాలోచించాలని ఆయన కేంద్రాన్ని కోరారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర బంద్
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర బంద్

By

Published : Mar 4, 2021, 4:39 PM IST

Updated : Mar 4, 2021, 7:40 PM IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శుక్రవారం తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు..ప్రభుత్వం సంఘీభావం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం తరఫున సమాచారశాఖ మంత్రి పేర్ని నాని ప్రకటన చేశారు. బంద్‌ సందర్భంగా ఆర్టీసీ బస్సులను మధ్యాహ్నం వరకు ఆపేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఒంటి గంట తర్వాత బస్సులు తిప్పుతామన్నారు. విధుల్లో పాల్గొనే ఆర్టీసీ సిబ్బంది నల్లబ్యాడ్జి ధరించి బంద్‌కు సంఘీభావం తెలపాలని సూచించారు.

అప్పుల్లో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోన్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించకుండా ఎలా చేయొచ్చే వివరిస్తూ.. పలు ప్రత్యామ్నాయాలను సీఎం జగన్ ఇప్పటికే రాత పూర్వకంగా తెలియజేశారన్నారు. ప్రజల ఆస్తిగానే విశాఖ ఉక్కు పరిశ్రమను ఉంచాలనే డిమాండ్‌తో వైకాపా ఉద్యమిస్తుందన్నారు. ప్రతి పాలకునికి భిన్నమైన ఆలోచనలు ఉంటాయయని..వందల జీవితాలతో ముడిపడి ఉన్న పరిశ్రమకు..ప్రత్యామ్నాయ మార్గాలున్నప్పుడు ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదన్నారు. అలాంటి నిర్ణయాలు ప్రజలకు, దేశానికి శ్రేయస్కరం కాబోవనేది తమ అభిప్రాయన్నారు. ఆర్టీసీని బతికించాలనే ఉద్దేశంతో ఆర్థికంగా రూ. 3,600 కోట్లు భారమైనా..ప్రభుత్వం భుజాన వేసుకుని ఆర్టీసీని ప్రజల ఆస్తిగా ఉంచామనే విషయాన్ని ఉదాహరణగా వివరించారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని పేర్ని నాని కోరారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర బంద్

ఇదీచదవండి: 'ఒక్క అవకాశం ఇచ్చినందుకే.. స్టీల్​ప్లాంట్​ను అమ్మేస్తున్నారు'

Last Updated : Mar 4, 2021, 7:40 PM IST

ABOUT THE AUTHOR

...view details