ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త బంద్

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. బంద్​కు ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించింది. భాజపా మినహా.. రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజా, కార్మిక సంఘాలు బంద్‌కు సంపూర్ణంగా సహకరిస్తున్నాయి.

bandh against privatization of steel plant
రాష్ట్ర బంద్

By

Published : Mar 5, 2021, 4:55 AM IST

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. బంద్‌ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపు మేరకు భాజపా మినహా... రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజా, కార్మిక సంఘాలు బంద్‌కు సంపూర్ణంగా సహకరిస్తున్నాయి. ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మూసి వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. లారీ యజమానుల సంఘాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు బంద్‌కు మద్దతు తెలిపాయి.

భాజపా మినహా అన్ని పార్టీల రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు కూడా బంద్‌ను విజయవంతం చేయాలని జిల్లాల్లోని తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం బంద్‌కు సహకరించాలని, మద్దతివ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్నినాని ప్రకటించారు. ఆర్టీసీ బస్సులను మధ్యాహ్నం ఒంటిగంట వరకు నడబోమన్న పేర్ని నాని మధ్యాహ్నం తర్వాత తిరుగుతాయని తెలిపారు.

ఇదీచూడండి:నేడు విశాఖలో పర్యటించనున్న చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details