రాష్ట్రం అభివృద్ధి చెందకూడదనే ప్రతిపక్ష నేత జగన్, ప్రధాని మోదీ, కేసీఆర్ కుట్రలు-కుతంత్రాలకు పాల్పడుతున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు.విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన కేసీఆర్,కేటీఆర్, భాజపా నేత రాంమాధవ్ హైదరాబాద్‌లో వైకాపా నేతలతో కలసి ఎంపి సీట్ల ఎంపికపై కసరత్తు చేస్తున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అవరోధాలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పదిలక్షల మంది ఈ ప్రాజెక్టును ఆధునిక దేవాలయంగా భావించి సందర్శించినా... ప్రతిపక్ష నేత అటువైపు ఒక్కసారి కూడా వెళ్లలేదని విమర్శించారు.
ఇవికూడా చదవండి