ముఖ్యమంత్రి జగన్తో సినీ దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య భేటీ అయ్యారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన వారు.. తాడేపల్లిలోని సీఎం నివాసంలో జగన్ను కలిశారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సీఎంతో రాజమౌళి సమావేశమయ్యారు. ఈ భేటీలో సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని నాని కూడా పాల్గొన్నారు.
భేటీ అనంతరం గన్నవరం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన రాజమౌళి.. సీఎం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారన్నారు. 'ఆర్ఆర్ఆర్' భారీ బడ్జెట్తో రూపొందించిన సినిమా కనుక.. సినిమాకు ఏం చేయాలో అది చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు రాజమౌళి వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. తమ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో ప్రకారమే సినిమా టిక్కెట్ల ధరలు ఉంటాయని.., ఎవరికీ ప్రత్యేక మినహాయింపులు ఉండవని పేర్ని నాని అన్నారు. చిన్న సినిమాల పోటీ లేకపోతే పెద్ద సినిమాలు ఐదు ఆటలు వేసుకోవచ్చునన్నారు. రాష్ట్రంలో 1100 థియేటర్లలో పెద్ద సినిమాలు ఉంటే ఒక షో మాత్రం చిన్న సినిమాకు ఉందన్నారు. సినిమా టికెట్లకు సంబంధించిన జీవో ఇచ్చినందుకు రాజమౌళి, దానయ్యలు సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారని అన్నారు.