ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా ఏపీకి రావాల్సిన నీటి వాటాలపై...అపెక్స్ కౌన్సిల్‌లో మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్..కేంద్ర జలశక్తిమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు లేఖ రూపంలోనూ వివరాలు సమర్పించారు. తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కోనే.. రాయలసీమ ప్రాంతంలోని 4 జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాకు శ్రీశైలం ప్రాజెక్టు నీరు ఒక్కటే ఆధారమని జగన్ లేఖలో పేర్కోన్నారు. తాగు, సాగునీటి అవసరాలతో పాటు పారిశ్రామిక అవసరాలకూ శ్రీశైలం ప్రాజెక్టుపైనే ఆధారపడాల్సి ఉందని...జగన్ స్పష్టం చేశారు. థార్ ఎడారి తర్వాత దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా అనంతపురం ఉందని...ఏడారి అభివృద్ధి పథకం కూడా అక్కడ అమల్లో ఉందని...లేఖలో జగన్ పేర్కొన్నారు. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలు కూడా....దుర్భిక్ష ప్రాంతాల అభివృద్ధి పథకంలో భాగమై ఉన్నాయని.. వలసలు అధికంగా ఉన్న ఈ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలంటే నీరే అత్యంత కీలకమైన వనరని..జగన్ అన్నారు.
కేసీఆర్ అంగీకారం తెలిపారు
తెలంగాణలోని మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నా.. 2 జిల్లాలకు 142, 104 టీఎంసీల చొప్పున నీటి కేటాయింపులు ఉన్నాయని...రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరుకు ప్రస్తుతం 50 టీఎంసీలు మాత్రమే ఇస్తున్నట్లు..జగన్ లేఖలో వివరించారు. ఈ ఆరు జిల్లాలకు జిల్లాకో 100 టీఎంసీలు లెక్కన....600 టీఎంసీలు అందించాల్సి ఉందని చెప్పారు. గతేడాది జూన్ 28న జరిగిన భేటీలోనూ..తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవే అంశాలపై అంగీకారాన్ని తెలిపారని జగన్ పేర్కొన్నారు. శ్రీశైలంలో 854 అడుగుల కంటే ఎక్కువ నీటి నిల్వ ఉన్నప్పుడే 7 వేల క్యూసెక్కుల చొప్పున...పోతిరెడ్డి పాడు ద్వారా రాయలసీమకు నీటిని తరలించగలమని స్పష్టంచేశారు.44 వేల క్యూసెక్కుల పూర్తి సామర్ధ్యంతో ఏడాదిలో 15 రోజులు మాత్రమే...నీటిని రాయలసీమకు ఎత్తిపోసే అవకాశముందని అన్నారు. కృష్ణా ట్రైబ్యునల్ తుది ఆదేశాల మేరకు చెన్నైకు 15 టీఎంసీలు, ఎస్ఆర్బీసీకి 19, కెసీ కెనాల్‌కు 10 టీఎంసీల కేటాయింపు ఉందని స్పష్టం చేశారు.
బోర్డు పరిధి కీలకం
పునర్విభజన చట్టం ప్రకారం గాలేరు నగరికి 38, తెలుగుగంగకు 29, వెలిగొండకు 43.5, హంద్రీనీవా 40, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు 10....,పైడిపాలెంకు 6, మైలవరంకి 7, సర్వారాయ సాగర్‌కు 3, గోరుకల్లుకి 12.4, అవుకుకి 4.14, సోమశిలకి 78, కండలేరు 68 టీఎంసీల మేర శ్రీశైలం రిజర్వాయర్ పై ఆధారపడి ఉన్నాయన్నారు. ఈ క్రమంలో.. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల పర్యవేక్షణ సక్రమంగా జరిగేందుకు బోర్డు పరిధి కీలకమని జగన్ చెప్పారు. భౌగోళికంగా...నాగార్జున సాగర్ కుడికాలువ హెడ్ రెగ్యులేటర్ ఏపీ పరిధిలో ఉన్నా ఇంకా తెలంగాణే దాన్ని నిర్వహించటం సరికాదని... తక్షణమే ఏపీకి ఆ బాధ్యతలు అప్పగించాలని జగన్ వ్యాఖ్యానించారు. అలాగే విద్యుత్ ఉత్పత్తి కూడా ఈ 6 జిల్లాలు, చెన్నై తాగునీటి అవసరాలు తీరాకే జరగాలన్నారు. అలాగే ఎనిమిదిన్నర జిల్లాల నీటి వినియోగానికి కీలకమైన...శ్రీశైలం, నాగార్జున సాగర్ నిర్వహణ, నియంత్రణ బాధ్యతల్ని ఏపీకి అప్పగించాలని..,లేదా బోర్డుకు స్పష్టమైన పరిధిని నిర్ధారించాలని కోరుతున్నట్టు సీఎం వెల్లడించారు.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఏపీకి తరలించాలి