Srisailam Dam gates Lifted: శ్రీశైలం జలాశయం 7 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్ వే ద్వారా లక్షా 95 వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. జూరాల, సుంకేసుల నుంచి 2.02 లక్షల క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలానికి పోటెత్తుతోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 884.7 అడుగులు, నీటి నిల్వ 213.88 టీఎంసీలుగా నమోదయింది. కుడి ఎడమ జలవిద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి చేసి 62,584 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.
Srisailam: నిండుకుండలా శ్రీశైలం జలాశయం.. 7 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల - శ్రీశైలం గేట్లు ఎత్తివేత
Srisailam Dam gates: శ్రీశైలం జలాశయం 7 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం నీటిమట్టం 884.7 అడుగులు, నీటి నిల్వ 213.88 టీఎంసీలుగా నమోదయింది.
నిండుకుండలా శ్రీశైలం జలాశయం
Last Updated : Aug 9, 2022, 8:11 PM IST