మహాప్రస్థానం.. తెలుగుజాతిని ఉర్రూతలూగించిన మహాకావ్యం. తన పుస్తకాన్ని నిలువుటద్దం సైజులో చూసుకోవాలని మహాకవి శ్రీశ్రీ ఆశించారట. ఆయన కలను నిజం చేసే క్రమంలో అంత పెద్దగా కాకున్నా.. అందులో సగం సైజులో ‘శ్రీశ్రీ మహాప్రస్థానం.. మొదలైన గీతాలు’ పేరిట భారీ పుస్తకాన్ని ప్రచురించారు. ‘సాహితీ మిత్రులు’ పక్షాన నేడు విజయవాడలోని మొగల్రాజపురం, సిద్ధార్థ ఆడిటోరియంలో పుస్తకానికి నీరాజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో.. రచయితలు శివారెడ్డి, వాసిరెడ్డి నవీన్, ఓల్గా, సినీనటుడు తనికెళ్ల భరణి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చిన వీరభద్రుడు హాజరయ్యారు. వీరితో సహా..పలువులు కవులు, ప్రముఖులు ఆన్ లైన్ ద్వారా పాల్గొన్నారు.
తెలుగు జాతి విప్లవ కిరణం శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం.. సాహిత్య ఖనిజ సంపద అని రచయితలు అన్నారు. 9 నెలల శ్రమించి శ్రీశ్రీ విశ్వేశ్వరావు ఆధ్వర్యంలో పలువురు రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. శ్రీశ్రీ కవిత్వం గొప్పతనాన్ని వివరించారు.