ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Sri Cements MD Meet CM: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాం: శ్రీ సిమెంట్స్ ఎండీ - శ్రీ సిమెంట్స్ ఎండీ తాజా వార్తలు

Sri Cements MD Meet CM Jagan: శ్రీ సిమెంట్స్ ఎండీ హెచ్ఎం బంగూర్ ముఖ్యమంత్రి జగన్​తో భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా పెదగారిపాడు వద్ద సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నామని, అందులో భాగంగానే సీఎంతో భేటీ అయినట్లు బంగూర్ స్పష్టం చేశారు.

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాం
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాం

By

Published : Dec 20, 2021, 9:10 PM IST

Sri Cements MD Meet CM Jagan:ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని శ్రీ సిమెంట్స్ ఎండీ హెచ్ఎం బంగూర్ స్పష్టం చేశారు. అందుకే ఇవాళ ముఖ్యమంత్రి జగన్​తో సమావేశమైనట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఏపీ పారిశ్రామిక పరంగా, పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నట్లు భావిస్తున్నామని అన్నారు. వృద్ధిరేటులో జాతీయ సగటు కంటే ఏపీ వృద్ధిరేటు ఎక్కువగా ఉందని ఆయన అన్నారు.

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగారిపాడు వద్ద సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నట్లు బంగూర్ తెలిపారు. మొత్తం రూ.1,500 కోట్లతో ఈ ప్లాంట్​ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సీఎం జగన్​తో భేటీ అయ్యి, ఈ అంశాన్నే వివరించినట్టు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details