విజయవాడ స్వరాజ్ మైదాన్‌లో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని గతేడాది ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని జైభీమ్ యాక్సిస్ జస్టిస్ వ్యవస్థాపకులు శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఏడాదిలోపు 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం నిర్మిస్తామన్న ప్రభుత్వం..10 నెలలు గడిచినా ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. తక్షణమే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
అంబేడ్కర్ జయంతి సందర్భంగా గుంటూరులో ర్యాలీ నిర్వహించినందుకు తమపై కేసు పెట్టడం ప్రభుత్వ కుటిలయత్నానికి నిదర్శనమన్నారు. సీఐని కులం పేరుతో దూషించామని తమపై అన్యాయంగా పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు కేసులు పెడుతున్నారని ఆరోపించారు.