కరోనా విజృంభణతో అందరూ ఇంట్లో ఉండే వస్తువులపైనే ఆధారపడుతున్నారు. సుగంధ ద్రవ్యాలను తమ ఆహారంలో వాడటం కాకుండా.. రోగనిరోధకశక్తిని పెంపొందించుకోవడానికి వాడుతున్నారు. అందుకే వీటికి గిరాకీ పెరుగుతోంది. విదేశాల్లో సైతం వీటి వాడకం పెరగడంతో...ఎగుమతులు జోరుగా సాగుతున్నాయి.
కషాయంలో అల్లం..
కరోనా నేపథ్యంలో తేనీటిలోనూ అల్లం వాడకం పెరిగింది. కషాయాల్లోనూ మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, పసుపు తదితర దినుసులతోపాటు కనీసం అంగుళంపాటి అల్లం ముక్కైనా వేయాలని చెబుతున్నారు. దీంతో వినియోగం, ధర కూడా రెట్టింపైంది. గతంలో కిలో అల్లం ధర రూ.80 ఉండేది. ఇప్పుడు రూ.160కి చేరింది. యాలకులు 100 గ్రాముల ధరే రూ.400 వరకు పలుకుతోంది.
- అల్లం, ఇతర సుగంధ ద్రవ్యాలు కలిపిన టీ పొడికీ డిమాండు పెరిగింది. గతంలో కిలో రూ.400 ఉండే రకాలు ఇప్పుడు రూ.480కిపైగానే ధర పలుకుతున్నాయి.
- రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు తులసి, దాల్చినచెక్క, నల్ల మిరియాలు, శొంఠి, ఎండుద్రాక్షకు రుచికి సరిపడా కాస్త బెల్లం, నిమ్మరసం కలిపి హెర్బల్ టీ తయారు చేసుకుని రోజుకు రెండుసార్లు తాగాలని ఆయుష్ మంత్రిత్వశాఖ సూచిస్తోంది. దీంతో వాటి వాడకమూ క్రమంగా పెరుగుతోంది.
ఇతర దేశాల్లోనూ..