ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భద్రాద్రి రామయ్య కల్యాణానికి.. గోటితోనే కోటి తలంబ్రాలు - సీతారామకల్యాణానికి ప్రత్యేకంగా తలంబ్రాలు

భద్రాద్రి రాముని కల్యాణానికి ప్రత్యేకంగా కోటి తలంబ్రాలను గోటితో వలిసి సిద్ధం చేస్తున్నారు. విజయవాడ భక్తవత్సల సేవా సమితి ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో రెండు నెలలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.

srirama navamiki talambralu
భద్రాద్రి రామయ్య కల్యాణానికి తలంబ్రాలు

By

Published : Jan 24, 2021, 10:38 PM IST

కల్యాణోత్సవం అంటే గుర్తొచ్చేది.. భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణమే. దీనికోసం భక్తలు ఎదురు చూస్తుంటారు. సీతారామకల్యాణాన్ని చూస్తూనే వారు తరించిపోతారు. ఈయేడాది ఏప్రిల్ 21న జరగనున్న శ్రీరామనవమికి పంపే తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉంటుంది.

భద్రాద్రి రామయ్య కల్యాణానికి తలంబ్రాలు వలుస్తున్న మహిళలు

కల్యాణానికి పంపేందుకు కోటి తలంబ్రాలను గోటితో వలుస్తారు. ఈ కార్యక్రమం విజయవాడ భక్తవత్సల సేవా సమితి ఆధ్వర్యంలో ప్రారంభమైంది. రాజమండ్రిలో ప్రత్యేకంగా పండించిన ధాన్యాన్ని తలంబ్రాల కోసం సిద్ధం చేసేందుకు సేవాసమితికి పంపారు. సమితి సభ్యులు తలంబ్రాలను గోటితో రెండు నెలల ముందు నుంచే వలుస్తారు. అనంతరం ఈ తలంబ్రాలను భద్రాచలం పంపుతారు. సీతారామకల్యాణంలో తమ వంతు భాగస్వామ్యం ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉందని సమితి సభ్యలు చెపుతున్నారు.

ఇదీ చదవండి: రశీదులేని 1.7 కిలోల బంగారం పట్టివేత.. నిందితుల అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details