ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

South Central Railway: దీపావళి ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు.. వివరాలివే.. - special trains for diwaali

దీపావళి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కొన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు పలు స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే ప్రత్యేక రైళ్లకు సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

South Central Railway: దీపావళి ప్రయాణికుల కోసం..ప్రత్యేక రైళ్లు.. వివరాలివే..
South Central Railway: దీపావళి ప్రయాణికుల కోసం..ప్రత్యేక రైళ్లు.. వివరాలివే..

By

Published : Oct 29, 2021, 8:23 PM IST

దీపావళి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. పండుగ సమయంలో సొంతూళ్లకు, బంధువుల ఇళ్లకు వెళ్లే వాళ్లు .. అనంతరం తిరిగి తమ గమ్యానికి చేరేందుకు అనుగుణంగా రైల్వే శాఖ రైళ్లను నడపనుంది. పండుగ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ మేరకు పలు స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే ప్రత్యేక రైళ్లకు సంబంధించి వివరాలను దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

  • వచ్చే నెల 6వ తేదీ నుంచి డిసెంబర్ 31 కర్నూలు - మచిలీపట్నం మధ్యలో మొత్తం 24 రైళ్లు తిరగనున్నాయి.
  • సికింద్రాబాద్ నుంచి అగర్తలా వెళ్లే రైలు సోమవారం బయలుదేరి గురువారం చేరుకుంటుంది. శుక్రవారం అక్కడి నుంచి తిరుగు ప్రయాణమై ఆదివారానికి సికింద్రాబాద్ చేరుతుంది.
  • 3 వ తేదీ నుంచి 18వరకు విశాఖ - సికింద్రాబాద్​ మధ్య పలురైళ్లు తిరగనున్నాయి.
  • నర్సాపూర్- సికింద్రాబాద్, సికింద్రాబాద్​ - విజయవాడ, సికింద్రాబాద్ - దనపూర్, దనపూర్- సికింద్రాబాద్ మధ్య పలు రైళ్లు నడవనున్నాయి.
  • 5,8,12,15 తేదీల్లో న్యూ జల్పైగురి- కన్యాకుమారి మధ్య దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను నడపనుంది.

    ఇదీ చదవండి: Rains: అల్పపీడన ప్రభావంతో.. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు

ABOUT THE AUTHOR

...view details