వీఎంసీ బరిలో ఉన్న అభ్యర్థుల విద్యా అర్హతలు విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో 347 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. వీరిలో డిగ్రీ, పీజీ వంటి ఉన్నత చదువులు చదివిన వారు స్వల్పంగానే ఉన్నారు. 29 మంది పీజీ, 59 మంది డిగ్రీ చదివారు. ఇక 10వ తరగతి చదివిన వారు 75 మంది అభ్యర్థులు ఉండగా.... కనీసంగా 10వ తరగతులలోపు విద్యార్హతతో సరిపెట్టుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. ఐ.టి.ఐ., డిప్లొమో వంటి చదువులు చదివినవారు 8 మంది ఉన్నారు.
పీజీ చేసిన ఆరుగురు తెలుగుదేశం పార్టీ నుంచి కార్పొరేటర్ అభ్యర్థులుగా పోటీ చేస్తుండగా..డిగ్రీ చదివిని వారు 11 మంది ఉన్నారు.ఇంటర్ చదివిన వారు ముగ్గురు, 10వ తరగతితో సరిపెట్టిన వారు 12 మంది ఉన్నారు. 10వ తరగతిలోపే చదువు ఆపేసిన వారు 15 మంది ...అసలు చదువేలేని వారు 8 మంది ఉన్నారు. ఇతర విద్యార్హత కలిగిన వారు మరొకరు ఉన్నారు.
వైకాపా విషయానికొస్తే పీజీ చదివిన ఏడుగురు... డిగ్రీ చేసిన 10 మంది పోటీకి దిగారు. ఇంటర్ చదివిన వారు నలుగురు, 10వ తరగతితో సరిపెట్టిన వారు 16 మంది ఉండగా.. విద్యార్హత లేనివారు, విద్యార్హత పత్రాలు సమర్పించని వారు మరో 8 మంది ఉన్నారు. జనసేన నుంచి నలుగురు చొప్పున పీజీ, డిగ్రీ చదివిని వారు ఉండగా.. ఇంటర్‌తో ఆపేసిన వారు ఆరుగురు, 10వ తరగతితో పుల్‌స్టాప్ పెట్టేసిన వారు 9 మంది ఉన్నారు. మరో 9మంది 10వ తరగతిలోపే చదువు ఆపేయగా... విద్యార్హత లేనివారు ఐదుగురు, డిప్లొమో చేసినవాళ్లు ఇద్దరు ఉన్నారు.
భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో నలుగురు పీజీ,మరో ముగ్గురు డిగ్రీ చేయగా... ఇంటర్ ఇద్దరు, 10వ తరగతి చదివిన వారు మరో నలుగురు ఉన్నారు. ఇక 10వ తరగతి పూర్తి చేయకుండానే చదువు ఆపేసిన వారు ముగ్గురు, చదువులేని వారు ఇద్దరు ఉన్నారు. ఒకరు డిప్లొమో చేశారు. పీజీ చేసిన ఓ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుండగా, ఏడుగురు డిగ్రీ చదివిన వారు బరిలో ఉన్నారు. మరో ముగ్గురు ఇంటర్, ఆరుగురు 10వ తరగతి వరకే విద్యాభ్యాసం సాగించారు. మరో పదిమంది 10వ తరగతిలోపే చదువు ఆపేశారు. నలుగురు మాత్రం అసలు చదువుకోలేదు.
సీపీఐ, సీపీఎం నుంచి ఇద్దరు పీజీ చేసిన అభ్యర్థులు, ముగ్గురు డిగ్రీ చేసిన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. ఇంటర్ చదవిన వారు ఒకరు, 10వ తరగతితో చదువు ఆపేసిన వారు ఏడుగురు, పదిలోపు చదువుతో సరిపెట్టిన వారు మరో నలుగురు ఉన్నారు. ఐదుగురు మాత్రం చదువు ఏమీ లేకుండానే ప్రస్తుతం ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు.
స్వతంత్రులు,ఇతర పార్టీల నుంచి ఐదుగురు పోస్టుగ్రాడ్యూయేట్లు ఉండగా... 21 మంది డిగ్రీ విద్యార్హతతో ఎన్నికల్లో పోటీకి దిగారు.12 మంది ఇంటర్ విద్యతోఆగిపోగా, 29 మంది 10వ తరగతి విద్యార్హత పొందారు. మరో 15 మంది 10వ తరగతిలోపే తమ విద్యను నిలిపేయగా చాలా మంది చదువుకోలేదు.
ఇదీచూడండి:విశాఖను సిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్‌గా మార్చారు: భాజపా-జనసేన