Vijayawada girls loco pilots: రోడ్డుపై వాహనాలు నడపటం తేలికే. వేలాది మందిని గమ్యస్థానానికి చేర్చే రైళ్లను పట్టాలపై నడపటం మాత్రం కత్తి మీద సాము లాంటిది. అందుకే రైల్వేశాఖలో లోక్ పైలెట్లుగా, అసిస్టెంట్ లోక్ పైలెట్లుగా ఎక్కువగా పురుషులే పనిచేస్తుంటారు. అయితే ఇదంతా గతం. మగవారికి ఏమాత్రం తీసిపోని రీతిలో ఈ ఉద్యోగాల్లో రాణిస్తున్నారు... మహిళలు. రైల్వేశాఖ నిర్వహించిన అర్హత పరీక్షలో ఉత్తమ ప్రతిభ చూపి.. విజయవాడ డివిజన్‌లో అసిస్టెంట్ లోకో పైలెట్‌గా సమర్ధంగా విధులు నిర్వహిస్తోంది గౌతమి.
Vijayawada girls loco pilots: అసిస్టెంట్ లోకో పైలెట్లు అనేక సవాళ్ల మధ్య పనిచేయాల్సి ఉంటుంది. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. ఎంత వేగంగా వెళ్లుతున్నా సరే ట్రాక్‌ను నిరంతరం నిశితంగా గమనిస్తుండాలి. సిగ్నళ్లకు అనుగుణంగా వేగాన్ని క్రమబద్దీకరిస్తూ రైలును నడపాల్సి ఉంటుంది. రైలు స్టేషన్ల నుంచి అధికారులు పంపే ఆదేశాలను పాటించాలి. ఇలా అనేక అంశాల్ని సమన్వయం చేసుకుంటూ వెళ్లితే గమ్యాన్ని చేరుకోగలమని గౌతమి ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తోంది.
Vijayawada girls loco pilots: మరోవైపు మహిళా లోకో పైలెట్లు కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విధులు నిర్వహించే అతివలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు కల్పిస్తున్నారు. మహిళలు తమ విధుల్ని సమర్ధంగా నిర్వహించేందుకు తోడ్పాటు అందిస్తున్నారు.