ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Chennupati Jagadish: తెలుగు వ్యక్తి చెన్నుపాటి జగదీశ్​కి ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం

కృష్ణా జిల్లాకు చెందిన చెన్నుపాటి జగదీశ్‌కు ఆస్ట్రేలియాలో(chennupati jagadish is new president of australian academy of science) అరుదైన గౌరవం దక్కడం పట్ల ఆయన సొంత జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్ట్రేలియా జాతీయ విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్రంలో పరిశోధకుడిగా పనిచేస్తున్న జగదీశ్‌.. ప్రపంచంలోనే అత్యుత్తమమైన సైన్స్‌ అకాడమీలో ఒకటైన ఆస్ట్రేలియా అకాడమీ అధ్యక్ష బాధ్యతలను తీసుకోవటం పట్ల..ఆయన గురువులు, మిత్రులు పట్టరాని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Australian Academy of Sciences President Chennupati Jagadish
ఆస్ట్రేలియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ అధ్యక్షుడు ఆచార్య చెన్నపాటి జగదీశ్‌

By

Published : Nov 29, 2021, 2:06 PM IST

తెలుగు తేజం చెన్నుపాటి జగదీశ్​కి ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం

Chennupati Jagadish: ఆచార్య చెన్నుపాటి జగదీశ్‌.. ఇప్పుడు ఎక్కువ మంది నోట చర్చనీయాంశమైన పేరు. కృష్ణా జిల్లా వల్లూరిపాలెం గ్రామానికి చెందిన జగదీశ్‌.. ఆస్ట్రేలియా పార్లమెంటుకు శాస్త్రీయ సలహాలు అందించే సైన్స్‌ అకాడమీకి అధ్యక్షునిగా(chennupati jagadish is new president of australian academy of science) నియమితులయ్యారు. తెలుగు వ్యక్తికి ఆస్ట్రేలియాలో అరుదైన దౌరవం దక్కడంపై ఆయన గురువులు చిన్నతనం నుంచి జగదీష్‌ శ్రద్ధాశక్తులను గుర్తు చేసుకుంటున్నారు. జగదీశ్‌ కీర్తి ఖండాతరాలు దాటినా.. అతనిలో విద్యాభిలాషను, చిత్తశుద్ధిని గుర్తించి ప్రాథమిక దశ నుంచి తగిన మార్గదర్శనం చేసింది మాత్రం నున్న గ్రామస్థులు చాగంటి సాంబిరెడ్డి. ప్రాథమిక విద్య ముగిశాక జగదీష్ తల్లి తండ్రులు ఖమ్మం జిల్లాలో ఆరికాయలపాడు గ్రామం చేరడంతో, అతని చదువుకు ఆటంకం కలిగింది. ఆ పరిస్థితిలో తోట్ల వల్లూరు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసిన సాంబిరెడ్డి జగదీష్ బాధ్యతలను స్వీకరించారు. మూడేళ్ల పాటు ఆయన వద్ద ఉండే చదువుకున్నారు. జగదీష్‌ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సాంబిరెడ్డి ఆకాంక్షించారు.

చెన్నపాటి జగదీశ్‌ భౌతిక శాస్త్రంలో అనేక పరిశోధనలు చేశారు. నానో టెక్నాలజీలో జగదీశ్‌ ప్రతిభ ప్రశంసనీయమని అతని మిత్రులు పేర్కొంటున్నారు. రెండేళ్ల కాంట్రాక్టుతో ఆస్ట్రేలియా సైన్స్‌ అకాడమీకి వెళ్లిన జగదీశ్‌(chennupati jagadish is a president of australian academy of science).. ఇప్పుడు ఆ అకాడమీకే నాయకత్వం వహించే స్థాయికి ఎదగడం అభినందనీయమన్నారు. పట్టుదల, నిర్విరామ కృషికి ఫలితంగానే జగదీశ్‌కు ఈ అరుదైన గౌరవం దక్కిందన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జగదీశ్‌తో మాట్లాడిన అతని మిత్రులు అభినందనలు తెలియజేశారు. జగదీశ్‌ మరింత ఉన్నత స్థాయికి ఎదిగి... నోబెల్‌ బహుమతి సాధించాలని అతని చిన్ననాటి మిత్రులు, ఉపాధ్యాయులు ఆకాంక్షిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details