కృష్ణా జిల్లా విజయవాడలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తన్నీరులో అంధుల ఆశ్రమానికి 1.8 ఎకరాల స్థలం ఉంది. ఆశ్రమ సిబ్బంది ఆ పొలాన్ని సాగుచేస్తున్నారు. స్థానికంగా ఉన్న కొంతమంది ఆ భూమిని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని ఆశ్రమ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. మరో ఫిర్యాదులో భాగంగా... విజయవాడ అజిత్ సింగ్ నగర్‌కు చెందిన ఖాజా మోహియుద్దీన్ తనను అన్యాయంగా ఉద్యోగంలోంచి తీసేశారని ఆరోపించాడు. మొత్తంగా... 63 ఫిర్యాదులు అందాయన్న పోలీసులు.. దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేస్తామన్నారు.
కృష్ణా జిల్లాలో 'స్పందన'కు వెల్లువలా ఫిర్యాదులు - in
విజయవాడలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి.. పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. అంధుల ఆశ్రమానికి సంబంధించిన పొలం ఆక్రమిస్తున్నారంటూ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు.
కృష్ణా జిల్లా 'స్పందన'కు వెల్లువెత్తిన ఫిర్యాదులు