ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఎల్​ఐసీపై కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు విరమించుకోవాలి' - ఎల్​ఐసీ వార్తలు

ఎల్​ఐసీలో ప్రభుత్వ వాటాలను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు సన్నాహాలు చేస్తోందో స్పష్టంగా ప్రకటించాలని దక్షిణ భారత ఎల్​ఐసి ఉద్యోగుల సమాఖ్య డిమాండ్‌ చేసింది.

South India lic Employees Federation
South India lic Employees Federation

By

Published : Sep 12, 2020, 5:13 PM IST

భారతీయ జీవిత బీమా సంస్థలో ప్రభుత్వ వాటాలను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు సన్నాహాలు చేస్తోందో స్పష్టంగా ప్రకటించాలని దక్షిణ భారత ఎల్​ఐసి ఉద్యోగుల సమాఖ్య డిమాండ్‌ చేసింది. రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఎల్‌ఐసీ చట్టానికి సవరణ చేసే ప్రయత్నం జరుగుతోందని విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆందోళన వ్యక్తం చేసింది. ఎల్‌ఐసీలో ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌- (ఐపీవో) ఇవ్వడం, ప్రభుత్వ వాటా ఉపసంహరణ, ప్రభుత్వ రంగంలోని ఎల్​ఐసీని స్టాక్‌ మార్కెట్‌లో లిస్టింగ్ ‌ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని కోరింది.

ABOUT THE AUTHOR

...view details