ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గూడ్స్​ రైళ్లలో నిత్యావసర సరకుల రవాణా..!

కరోనా నివారణ దృష్ట్యా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్​ కొనసాగుతోంది. ఈ సమయంలో నిత్యావసర సరకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. గూడ్స్​ రైళ్ల ద్వారా రవాణా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

south-central-railway-started-grocery-transport-through-goods-trains
south-central-railway-started-grocery-transport-through-goods-trains

By

Published : Apr 5, 2020, 8:25 PM IST

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్నందున నిత్యావసర సరకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ప్యాసింజర్ రైళ్లు రద్దయినా.. గూడ్స్ రైళ్ల ద్వారా సరకు రవాణా చేస్తూ సమస్యలు తలెత్తకుండా చూస్తున్నామని రైల్వే అధికారులు పేర్కొన్నారు. మార్చ్ 23 నుంచి ఏప్రిల్ 4 వరకు 1342 వ్యాగన్ల చక్కెర, 958 వ్యాగన్ల ఉప్పు, 378 వ్యాగన్ల నూనెను సరఫరా చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details