ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Special Trains: సంక్రాంతి రద్దీ దృష్ట్యా.. పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు - సంక్రాంతి వార్తలు

Special Trains: సంక్రాంతి రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. జనవరి 1 నుంచి నెలాఖరు వరకు పలు ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని ప్రకటింది.

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

By

Published : Dec 24, 2021, 7:10 PM IST

Special Trains :సంక్రాంతి రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. జనవరి 1 నుంచి నెలాఖరు వరకు పలు ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని స్పష్టం చేసింది.

  • జనవరి 1 నుంచి ప్రతి శని, మంగళ, గురు వారాల్లో మచిలీపట్నం-కర్నూలు సిటీ ప్రత్యేక రైళ్లు
  • జనవరి 2 నుంచి ప్రతి ఆది, బుధ, శుక్ర వారాల్లో కర్నూలు- మచిలీపట్నం ప్రత్యేక రైళ్లు
  • జనవరి 2 నుంచి ప్రతి ఆదివారం నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్​కు ప్రత్యేక రైలు
  • జనవరి 3 నుంచి ప్రతి సోమవారం సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేక రైలు
  • జనవరి 3 నుంచి ప్రతి సోమవారం పూర్ణ నుంచి తిరుపతికి, ప్రతి బుధవారం తిరుపతి నుంచి పూర్ణకు ప్రత్యేక రైలు
  • జనవరి 2 నుంచి ప్రతి ఆదివారం మచిలీపట్నం నుంచి కాజీపేట మీదుగా సికింద్రాబాద్​కు, సికింద్రాబాద్ నుంచి గుంటూరు మీదుగా మచిలీపట్నం ప్రత్యేక రైళ్లు
  • జనవరి 7 నుంచి ప్రతి శుక్రవారం తిరుపతి నుంచి అకోలాకు ప్రత్యే రైళ్లు
  • జనవరి 9 నుంచి ప్రతి ఆదివారం అకోలా నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు

ఈ రైళ్లలో ముందస్తు టికెట్ రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details