ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దక్షిణ మధ్య రైల్వే 'జన్ ఆందోళన్' నిర్వహణ

ప్రధాని మోదీ పిలుపు మేరకు విజయవాడ డివిజన్​లోని వివిధ డిపోలు, ఫీల్డ్ యూనిట్లలో 'జన్ ఆందోళన్' పేరిట ప్రచారాన్ని చేపట్టింది రైల్వే శాఖ. తాము నిబంధనలు పాటిస్తూ.... ఇతరులకూ అవగాహన కల్పిస్తామని రైల్వే అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.

By

Published : Oct 8, 2020, 11:12 PM IST

jan andolan
jan andolan

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు 'జన్ ఆందోళన్' పేరిట ప్రచార ఉద్యమాన్ని దక్షిణ మధ్య రైల్వే చేపట్టింది. రానున్న పండగలు, శీతాకాలం దృష్ట్యా కరోనా మహమ్మారి వ్యాపించకుండా ఐక్యంగా పోరాడటం సహా ప్రయాణికుల్లో అవగాహన కల్పించేందుకు ప్రచారం చేయాలన్న ప్రధాని సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. విజయవాడ డివిజన్​లోని వివిధ డిపోలు, ఫీల్డ్ యూనిట్లలో 'జన్ ఆందోళన్' పేరిట ప్రచారాన్ని చేపట్టారు.

తాము కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇతరులకూ అవగాహన కల్పిస్తామంటూ విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీనివాస్... బ్రాంచ్ అధికారులు, సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేశారు. డివిజన్‌లోని అన్ని ప్రధాన స్టేషన్లలో క్రమం తప్పకుండా మైకుల ద్వారా నిబంధనలు తెలియజేయడం, జాగ్రత్తలు తీసుకునే బ్యానర్లు, పోస్టర్‌లను సిబ్బంది ప్రదర్శించారు. ప్రయాణికులు, సాధారణ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వీలుగా ముందు జాగ్రత్త సందేశాలతో డిజిటల్ డిస్​ప్లే స్క్రీన్‌లు ప్రదర్శించారు.

ABOUT THE AUTHOR

...view details