ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

SCR NEWS: పలు రైళ్లు రద్దు.. 6 రైళ్లు పునరుద్ధరించిన దక్షిణమధ్య రైల్వే - రైళ్ల రద్దు

భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రైలు ట్రాక్​ల మరమ్మతు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 24, 25 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని రైళ్లు పునరుద్ధరించినట్లు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది.

SCR NEWS
SCR NEWS

By

Published : Nov 24, 2021, 7:06 AM IST

భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రైలు ట్రాక్​ల మరమ్మతు పనులు కొనసాగుతూన్నాయి. ఈ క్రమంలో(five trains cancelled by scr) ఈనెల 24, 25 తేదీల్లో ఐదు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది.విజయవాడ డివిజన్‌లోని నెల్లూరు- పడుగుపాడు, గుంతకల్‌ డివిజన్‌లోని రాజంపేట- నందలూరు, రేణిగుంట- పూడి సెక్షన్‌లో ట్రాక్‌లపై నీరు నిలిచిపోవడం, మరమ్మతు పనులు కొనసాగుతుండటం వల్ల పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈ నెల 25న నడిటే మదురై-బికనేర్‌, చెన్నయ్‌ సెంట్రల్‌- న్యూ జల్పాయిగుడి, సికింద్రాబాద్ -గోరఖ్‌పూర్‌ రైళ్లను రద్దు చేసినట్టు వెల్లడించింది. హైదరాబాద్-గోరఖ్ పూర్-హెచ్.ఎస్ నాందేడ్ -మన్మాడ్ మధ్య ఈనెల 25, 26, 27, 28 తేదీల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది.

పునరుద్ధరించిన రైళ్లు..

భారీ వర్షాల కారణంగా ట్రాక్ దెబ్బతిని నిలిచి పోయిన రైళ్లను దక్షిణ మధ్య రైల్వే క్రమంగా పట్టాలెక్కిస్తోంది. ట్రాక్ మరమ్మతు పనులు పూర్తైన అనంతరం ఆయా రూట్లలో రైళ్లను పునరుద్దరిస్తోంది. పలు ప్రాంతాల మీదుగా వెళ్లే పలు రైళ్లను తిరిగి నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. రేపు నడిచే 6 రైళ్లను యథాతథంగా నడుపుతున్నట్లు తెలిపారు. రేపటి(గురవారం) తిరుపతి- హజరత్ నిజాముద్దీన్ రైలు , చెన్నై సెంట్రల్- ముంబై సీఎస్ఎంటీ , రైళ్లను పునరుద్దరించారు. రేపటి ముంబై సీఎస్ ఎంటీ -చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్ -అహ్మదాబాద్ , చెన్నై సెంట్రల్ - ముంబై ఎల్ టీ టీ , ముంబై ఎల్ టీటీ- చెన్నై సెంట్రల్ రైళ్లు యథాతథంగా నడుస్తాయని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:Kondapalli Municipal Chairman Election: వైకాపా కౌన్సిలర్ల వీరంగం.. ఛైర్మన్ ఎన్నిక వాయిదా...

ABOUT THE AUTHOR

...view details