రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల(rains in ap) కారణంగా పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (south central railway) రద్దు చేసింది. తడ - సుళ్లూరుపేట మార్గంలో.. ప్రవహిస్తోన్న వరద నీరు ప్రమాదకర స్థాయికి చేరటంతో.. ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్లు రద్దయ్యాయి. రైళ్ల రీషెడ్యూల్, దారి మళ్లింపును పాక్షికంగా రద్దు చేశారు. ఇవాల్టి తిరుపతి- చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్ - చెన్నై రైళ్లు రద్దయ్యాయి. చెన్నై సెంట్రల్- ముంబై సీఎస్ ఎంటీ, గుంతకల్- రేణిగుంట రైళ్లు రద్దుచేశారు. బిట్రగుంట- చెన్నై సెంట్రల్ , చెన్నై సెంట్రల్- బిట్రగుంట , విజయవాడ -చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్ - విజయవాడ రైళ్లు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
నందలూరు - రాజంపేట మధ్య రైలు పట్టాలపై వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోన్న కారణంగా.. ఆ మార్గంలోనూ వెళ్లే పలు రైళ్లు రద్దు చేసి, మరికొన్నింటిని దారి మళ్లించారు. చెన్నై సెంట్రల్ - అహ్మదాబాద్, కాచిగూడ-చెంగల్పట్టు, రైళ్లు రద్దయ్యాయి.ఎల్.టీ.టీ ముంబై- చెన్నై సెంట్రల్, సీఎస్టీ ముంబై- నాగర్ సోల్, మధురై-ఎల్.టీ.టీ ముంబై రైళ్లు రద్దు చేశారు. చెంగల్పట్టు- కాచిగూడ, చెన్నై సెంట్రల్- ఎల్.టీ.టీ ముంబై రైళ్లు రద్దు చేశారు. తడ- సుళ్లూరు పేట మధ్య నడిచే 4 రైళ్లు, నందలూరు- రాజం పేట మధ్య నడిచే 12 రైళ్లు దారి మళ్లించి నడుపుతున్నారు.