ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Trains cancelled: 27 రైళ్లు రద్దు.. కారణం ఏంటంటే..? - 27 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

జూన్ 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు.. ప్రయాణికుల రద్దీ లేని కారణంగా 27 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Trains cancelled
Trains cancelled

By

Published : May 31, 2021, 2:23 PM IST

ప్రయాణికుల రద్దీలేని కారణంగా 27 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జూన్ 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. రద్దు చేసిన రైళ్ల వివరాలను వెల్లడించింది. ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని... ఈవిషయాన్ని ప్రయాణికులు గమనించాలని రైల్వే శాఖ కోరింది. కరోనా విజృంభనతో చాలామంది ప్రయాణాలు మానుకుంటున్నారు. ఫలితంగా చాలా రైళ్లలో సీట్లు నిండటం లేదు. తక్కువమంది ప్రయాణికులతో నడపడం ఇష్టం లేక ఇటీవల కాలంలో తరచుగా రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసింది.

రద్దయిన రైళ్ల వివరాలు..

  1. గూడూరు-విజయవాడ
  2. విజయవాడ-గూడూరు
  3. గుంటూరు-వికారాబాద్
  4. వికారబాద్-గుంటూరు
  5. విజయవాడ-సికింద్రాబాద్
  6. సికింద్రాబాద్-విజయవాడ
  7. బీదర్-హైదరాబాద్
  8. సికింద్రాబాద్-బీదర్
  9. హైదరాబాద్-సిర్ పూర్ కాజగ్ నగర్
  10. సిర్పూర్ కాగజ్ నగర్ -సికింద్రాబాద్
  11. సికింద్రాబాద్-కర్నూల్ సిటీ
  12. కర్నూల్ సిటీ-సికింద్రాబాద్
  13. సికింద్రాబాద్-కర్నూల్ సిటీ
  14. కర్నూల్ సిటీ-సికింద్రాబాద్
  15. సికింద్రాబాద్-సిర్ పూర్ కాగజ్ నగర్
  16. సిర్పూర్ కాగజ్ నగర్ -సికింద్రాబాద్
  17. నర్సాపూర్-నిడుదవోలు
  18. నిడుదవోలు-నర్సాపూర్
  19. గుంటూరు-కాచిగూడ
  20. కాచిగూడ-గుంటూరు
  21. ఆదిలాబాద్-హెచ్.ఎస్.నాందేడ్
  22. హెచ్.ఎస్.నాందేడ్-ఆదిలాబాద్
  23. పర్బని-హెచ్.ఎస్.నాందేడ్
  24. ఎం.జీ.ఆర్.చెన్నయ్ సెంట్రల్-తిరుపతి
  25. విజయవాడ-ఎం.జీ.ఆర్.చెన్నయ్ సెంట్రల్
  26. ఎం.జీ.ఆర్.చెన్నయ్ సెంట్రల్-తిరుపతి
  27. తిరుపతి-ఎం.జీ.ఆర్.చెన్నయ్ సెంట్రల్​ల మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ పేర్కొంది.

ఇదీ చదవండి :కరోనాతో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కోటయ్య మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details