కడప నగర భూగర్భ డ్రైనేజీ సమస్యలపై మంగళవారం ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ మేయర్ సురేష్ బాబులు విజయవాడలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో చర్చించారు. కడప నగర ప్రజలు కొన్ని సంవత్సరాలుగా భూగర్భ డ్రైనేజీకి సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డిలు... పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను కోరారు.
కడప: భూగర్భ డ్రైనేజీ సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం - ఎంపీ అవినాష్ రెడ్డి వార్తలు
కడప నగరంలో భూగర్భ డ్రైనేజీ సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి. అంజాద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.
![కడప: భూగర్భ డ్రైనేజీ సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం underground drainage problem in Kadapa city](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7831950-993-7831950-1593512107624.jpg)
కడప నగరపాలక సంస్థ పరిధిని నాలుగు జోన్లుగా విభజించారని, తొలివిడతగా 3, 4 జోన్లలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తైనా సకాలంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదని వారు మంత్రికి తెలిపారు.. దీంతో ప్రజలు అనధికారికంగా డ్రైనేజి కనెక్షన్లు ఇచ్చుకోవడంతో... చాలా చోట్ల పైపులైన్లు పాడైపోయాయని, అంతేకాక ఛాంబర్లు లేకపోవడంతో పగుళ్ళు ఏర్పడి మురుగునీరు రోడ్లపైకి వస్తోందని, ప్రతీసారి గల్ఫర్ మెషీన్లతో ఆ నీటిని పంపాల్సి వస్తోందని అన్నారు. అలాగే, ప్రజల సౌకర్యార్థం భూగర్భ డ్రైనేజీ కోసం తవ్విన రోడ్లను ఇది వరకే పునరుద్ధరణ చేశారు. నానపల్లి వద్ద ప్రభుత్వం కేటాయించిన 70 ఎకరాల స్థలంలో నూతన టెక్నాలజీని ఉపయోగించి సూవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మించాలని కోరారు.