ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆస్తి కోసం తల్లికి తలకొరివి పెట్టకుండా ఇంటికి తాళం వేసి వెళ్లిన కుమారుడు - కృష్ణా జిల్లా మచిలీపట్నం వార్తలు

ఆస్తి కోసం కన్నతల్లి దహన సంస్కారాలు నిర్వహించకుండా అక్కడే వదిలేసి వెళ్లిపోయాడా కుమారుడు. కుటుంబ కలహాలతో తన కుమార్తె వద్ద జీవిస్తున్న ఆ వృద్ధురాలు.. ప్రాణాలు విడిచింది. తన కోరిక మేరకు దహన సంస్కారాల కోసం.. కుమారుని వద్దకు మృతదేహాన్ని తీసుకురాగా.. అంత్యక్రియలు చేయకుండా మృతదేహాన్ని వదిలేసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు.

son doesn't held cremation of mother for property in machilipatnam
ఆస్తి కోసం దురాఘతం.. కన్నతల్లి అంత్యక్రియలు చేయనని ఇంటికి తాళం వేసి వేళ్లిపోయిన కుమారుడు

By

Published : Jan 6, 2021, 2:45 PM IST

ఆస్తి కోసం.. కన్నతల్లికే కొరివి పెట్టకుండా ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు ఓ కుమారుడు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన రాజారత్నం అనే మహిళ.. కుటుంబ కలహాల వల్ల బంటుమల్లిలోని కుమార్తె వద్ద ఉంటూ మృతి చెందింది. కుమారుడితో తలకొరివి పెట్టించుకోవాలన్న ఆమె కోరికతో.. మచిలీపట్నంలోని ఇంటికి తీసుకొచ్చారు. తీరా తెచ్చాక.. కుమారుడు వరప్రసాద్‌ వారిపై ఆగ్రహించి అంత్యక్రియలు చేయడానికి నిరాకరించాడు. అంతేకాకుండా మృతదేహాన్ని బయటే వదిలేసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు.

ఆస్తి కోసం తన అక్క, బావే తల్లిని చంపేసి ఇంటికి తెచ్చారంటూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆస్తి కోసం మృతదేహాన్ని వదిలేసి వెళ్లిపోవటం చర్చనీయాంశంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details