ఈనెల 13వ తేదీన భవ్యకాశీ, దివ్యకాశీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కోరారు. ఇందుకు అవసరమైన వసతులు ఏర్పాటు చేసుకోవాలని ఆయన పార్టీ నేతలు, శ్రేణులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని శైవ క్షేత్రాల్లో సామూహికంగా టీవీ స్క్రీన్ లు ఏర్పాటు చేసి కాశీ నుంచి ప్రధాని నరేంద్రమోదీ... బౌద్దిక్ ను వీక్షించేలా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
somu veeraju: 'భవ్యకాశీ, దివ్యకాశీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి' - bjp state president
భవ్యకాశీ, దివ్యకాశీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కోరారు. ఇందుకు అవసరమైన వసతులు ఏర్పాటు చేసుకోవాలని ఆయన పార్టీ నేతలు, శ్రేణులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో సూచించారు.
సోమువీర్రాజు
ఇందుకు అవసరమైతే ట్రయిల్ రన్ నిర్వహించాలని కోరారు. దేవాలయాల సమీపంలోని భక్తులకు కూడా ముందస్తు సమాచారం ఇస్తే ఎక్కువ మంది ఈ కార్యక్రమన్నివీక్షించే వీలుంటుందని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ కాశీక్షేత్రంలో చేసిన అభివృద్ధి కళ్లకట్టినట్లు కనపడుతుందని... భాజపా అధికారంలోకి వచ్చిన వెంటనే వారణాశి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి శరవేగంతో పనులు చేయించారన్నారు.
ఇదీ చదవండి: