ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 4, 2021, 10:15 PM IST

Updated : Jan 5, 2021, 7:43 AM IST

ETV Bharat / city

రేపు భాజపా, జనసేన ఆధ్వర్యంలో రామతీర్థాన్ని సందర్శిస్తాం: సోము వీర్రాజు

హిందూ ధార్మిక విధానంపై, హిందూ ధర్మంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. నాలుగు వందల సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన రామతీర్థం దేవాలయంలో విగ్రహాలు ధ్వంసం చేయటం దారుణమన్నారు. మంగళవారం రామ తీర్థాన్ని సందర్శించేందుకు భాజపా, జనసేన సంయుక్తంగా యాత్ర చేపడుతున్నట్లు సోము వీర్రాజు వెల్లడించారు.

రేపు భాజాపా, జనసేన ఆధ్వర్యంలో రామతీర్థాన్ని సందర్శిస్తాం
రేపు భాజాపా, జనసేన ఆధ్వర్యంలో రామతీర్థాన్ని సందర్శిస్తాం

నాలుగు వందల సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన రామతీర్థం దేవాలయంలో విగ్రహాలు ధ్వంసం చేయటం దారుణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. శ్రీరామ చంద్రుడు సంచరించిన ప్రదేశంలో ఉన్న ఆలయంలో విగ్రహ ధ్వంసం కారణంగా హిందువుల మనోభావాలు దెబ్బ తిన్నాయని మండిపడ్డారు. శ్రీరామునికి జరిగిన అపచారాన్ని దేశం మెుత్తం ఖండించే పరిస్థితి నెలకొందన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రభుత్వం సరిగా స్పందించట లేదని ఆయన విమర్శించారు. పిఠాపురం, అంతర్వేది వంటి ఘటనల నుంచి నేటి వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోందని దుయ్యబట్టారు.

గత ప్రభుత్వ హయాంలో కూలగొట్టిన ఆలయాలను కూడా ఈ ప్రభుత్వం పునర్నిర్మించలేదని అన్నారు. హిందూ ధార్మిక విధానంపై, హిందూ ధర్మంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. వైఎస్ విగ్రహాలు పెట్టిన ప్రభుత్వం..,హిందూ దేవుళ్ల విగ్రహాలను ఎందుకు పెట్టటంలేదని నిలదీశారు. మంగళవారం రామ తీర్థాన్ని సందర్శించేందుకు భాజపా, జనసేన సంయుక్తంగా యాత్ర చేపడుతున్నట్లు సోము వీర్రాజు వెల్లడించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.

Last Updated : Jan 5, 2021, 7:43 AM IST

ABOUT THE AUTHOR

...view details