ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేరాలు అదుపులో ఉండాలంటే.. అలాంటి ప్రభుత్వం రావాలి: సోము వీర్రాజు - సోము వీర్రాజు న్యూస్

వైకాపా పాలనలో మహిళలపై అకృత్యాలు నిత్యకృత్యమైపోతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అకృత్యాలు, హత్యలు సాధారణమైపోయిన తరుణంలో అసలు ప్రభుత్వం ఉందా ? అనే అనుమానం కలుగుతోందని అన్నారు.

నేరాలు అదుపులో ఉండాలంటే.. అలాంటి ప్రభుత్వం రావాలి
నేరాలు అదుపులో ఉండాలంటే.. అలాంటి ప్రభుత్వం రావాలి

By

Published : May 3, 2022, 6:45 PM IST

నేరాలు అదుపులో ఉండాలంటే.. అలాంటి ప్రభుత్వం రావాలి

రాష్ట్రంలో అకృత్యాలు, హత్యలు సాధారణమైపోయిన తరుణంలో అసలు ప్రభుత్వం ఉందా ? అనే అనుమానం కలుగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపల్లె సామూహిక అత్యాచార ఘటనపై స్పందించిన ఆయన.. బాధితురాలి భర్త రైల్వే పోలీస్ స్టేషన్​కి వెళ్ళినా వారు పట్టించుకోలేదని ఆరోపించారు. వైకాపా పాలనలో మహిళలపై అకృత్యాలు నిత్యకృత్యమైపోతున్నాయని విమర్శించారు.

రాష్ట్రంలో యువతకు గంజాయి విస్తృతంగా దొరుకుతోందని.., మాదకద్రవ్యాలు వినియోగించే వారిని కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూపీలో నేరస్థుల పట్ల అక్కడి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోందని.., అలాంటి ప్రభుత్వం రాష్ట్రంలోనూ ఏర్పడాలని సోము వీర్రాజు ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో ఎన్నో ఘోరాలు.. అదృష్టం బాగుండి నేను బయటపడ్డా: ఎంపీ రఘురామ

ABOUT THE AUTHOR

...view details