బడుగు, బలహీన వర్గాల ఓట్లతో గద్దెనెక్కిన వైకాపా ప్రభుత్వం వారి అభివృద్ధిని గాలికి వదిలేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గాల సమగ్రాభివృద్ధికి కేటాయిస్తున్న నిధులను వైకాపా ప్రభుత్వం దారి మళ్లిస్తూ.. వారి ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తోందని విమర్శించారు. అవినీతి అక్రమాలలో వైకాపా, తెదేపా పార్టీలు కవల పిల్లలని సోము దుయ్యబట్టారు. ఈ రెండు పార్టీలు పరస్పర అవగాహనతో రాష్ట్ర ఖజానాను దోచుకుంటూ.., రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయన్నారు. ఎన్ఎస్ఎఫ్డీసీ ద్వారా ఎస్సీ వర్గానికి చెందిన నిరుద్యోగులకు ఎందుకు నిధులు కేటాయించట్లేదో చెప్పే దమ్ము మంత్రులకు ఉందా ? అని ప్రశ్నించారు.
అవినీతి అక్రమాల్లో ఆ రెండు పార్టీలు కవల పిల్లలు: సోము వీర్రాజు
Somu Veerraju on YSRCP, TDP: అవినీతి అక్రమాలలో వైకాపా, తెదేపా పార్టీలు కవల పిల్లలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దుయ్యబట్టారు. ఈ రెండు పార్టీలు పరస్పర అవగాహనతో రాష్ట్ర ఖజానాను దోచుకుంటూ.., రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని విమర్శించారు. బడుగు, బలహీన వర్గాల ఓట్లతో గద్దెనెక్కిన వైకాపా ప్రభుత్వం వారి అభివృద్ధిని గాలికి వదిలేసిందని ఆక్షేపించారు.
సోము వీర్రాజు
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరా ? అని వైకాపా ప్రభుత్వాన్ని సోము వీర్రాజు నిలదీశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు జగన్ పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని.., ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు. ప్రజాసమస్యలపై రానున్న రోజుల్లో మరింత వేగంగా ప్రజా ఉద్యమాలను చేపడతామని చెప్పారు. ప్రజల పక్షాన భాజపా ఎల్లప్పుడూ పోరాటాలు చేస్తుందని వెల్లడించారు.
ఇదీ చదవండి