Somu Veeraju: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా తాత్సారం చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల టన్నుల ధాన్యం ఇంకా వరి కల్లాల్లో ఉండడం వల్ల.. రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. రెండో పంట చేతికి వచ్చే సమయం ఆసన్నమవుతున్నా.. ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని పాటించడం లేదని ఆరోపించారు. రైతులకు అండగా భాజపా... పోరాటం సాగిస్తుందని చెప్పారు.
Somu Veeraju: రైతులకు అండగా పోరాటం చేస్తాం: సోము వీర్రాజు
Somu Veeraju: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా ఆలస్యం చేస్తోందని సోము వీర్రాజు మండిపడ్డారు. లక్షల టన్నుల ధాన్యం ఇంకా వరి కల్లాల్లోనే ఉందన్నారు. మరోవైపు నిరుద్యోగుల కోసం వెంటనే కొలువుల నోటిఫికేషన్లు ఇవ్వాలని వీర్రాజు డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోలుపై సోము వీర్రాజు
మరోవైపు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషెన్ విడుదల చేయలేదని మండిపడ్డారు. నీటిపారుదల శాఖలో కీలకమైన.. 3 వేల లస్కర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. పోలీసు, ఇతర ఉద్యోగాలకు సంబంధించిన నియామకాలకు వెంటనే.. నోటిఫికేషన్ విడుదల చేయాలని వీర్రాజు డిమాండ్ చేశారు.
TDP Fires on YSRCP: కల్తీ సారా మరణాలకు అనారోగ్యాన్ని అంటగడుతున్నారు: తెదేపా