స్థానిక సమస్యలపై అన్ని జిల్లాల్లోనూ భాజపా పోరాటం చేస్తుందని.. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. విజయవాడలో జరిగిన భాజపా రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడేళ్లలో ప్రధాని సహకారంతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందన్న ఆయన.. రాష్ట్రాభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. టిడ్కో ఇళ్లపైనా మాట్లాడిన వీర్రాజు.. ఇంతవరకు లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
SOMU VEERAJU: బద్వేలు ఉప ఎన్నికలో అందుకే పోటీ చేస్తున్నాం: సోము - bjp comments on ysrcp government
స్థానిక సమస్యలపై అన్ని జిల్లాల్లోనూ భాజపా పోరాటం చేస్తుందని.. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బద్వేలు ఉపన్నికపై స్పందించిన ఆయన.. ఒకే ఒక కారణంతో పోటీ చేస్తున్నామని చెప్పారు. విజయవాడలో భాజపా రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశంలో పార్టీ నిర్ణయాన్ని వెల్లడించారు.
![SOMU VEERAJU: బద్వేలు ఉప ఎన్నికలో అందుకే పోటీ చేస్తున్నాం: సోము somju veeraju](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13306476-707-13306476-1633767866452.jpg)
సోము వీర్రాజు
ఇక, బద్వేలు ఉపన్నికలో ఎందుకు పోటీ చేస్తున్నామనే విషయంపైనా సోమూ స్పష్టత ఇచ్చారు. తమ పార్టీ సిద్ధాంతపరమైన విధానంతోనే బద్వేలు ఉపన్నికలో పోటీ చేస్తోందని చెప్పారు. వారసత్వ రాజకీయాలకు భాజపా పూర్తి వ్యతిరేకమని మరోసారి స్పష్టం చేశారు. బద్వేలులో భాజపా తరఫున మంచి అభ్యర్థిని నిలబెట్టామన్న ఆయన.. విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సోము వీర్రాజు, సునీల్ దేవ్‌ధర్, ఎంపీ జీవీఎల్, కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
PAYYAVULA KESAV: ఆ సంక్షోభానికి ప్రధాన కారణం సీఎం జగనే: పయ్యావుల
Last Updated : Oct 9, 2021, 5:04 PM IST